Chandrababu: టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులు చేస్తున్నారు: చంద్రబాబు

Chandrababu concerns about after polling incidents
  • ఏపీలో ముగిసిన పోలింగ్
  • ఇప్పటికీ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న చంద్రబాబు
  • ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ పై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి 
ఏపీలో పోలింగ్ అనంతర పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. నిన్నటి పోలింగ్ లో వైసీపీ గూండాల దాడులను ధైర్యంగా ఎదిరించిన టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులకు తెగబడుతున్నారని ఆయన ఆరోపించారు. పల్నాడు, చంద్రగిరి సహా పలు చోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడం ఆందోళనకరమని పేర్కొన్నారు. 

ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో శాంతిభద్రతలు పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు కోరారు. హింసను ప్రేరేపిస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Chandrababu
Polling
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News