Annabathuni Sivakumar: ఓటరు-చెంపదెబ్బ వ్యవహారం: తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై కేసు నమోదు

FIR files against Tenali MLA Annabathuni Sivakumar
  • నిన్న పోలింగ్ సందర్భంగా తెనాలిలో ఘటన
  • ఓటరుపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని
  • తిరిగి ఎమ్మెల్యేను కొట్టిన ఓటరు
  • ఓటరుపై మూకుమ్మడి దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులు
  • బాధితుడి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్న పోలీసులు
తెనాలిలో నిన్న పోలింగ్ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఓటరు గొట్టిముక్కల సుధాకర్ మధ్య చెంపదెబ్బల రగడ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే అన్నాబత్తుని నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, క్యూలో రావాలని గొట్టిముక్కల సుధాకర్ కోరారు. 

అయితే, ఎమ్మెల్యే ఆ ఓటరుపై చేయి చేసుకోగా, ఓటరు  గొట్టిముక్కల సుధాకర్ కూడా ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా సుధాకర్ పై దాడి చేసి పిడిగుద్దుల వర్షం కురిపించారు. గాయాలపాలైన సుధాకర్ గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. 

ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై కేసు నమోదైంది. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్యేతో పాటు ఏడుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని గొట్టిముక్కల సుధాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
Annabathuni Sivakumar
FIR
Gottimukkala Sivakumar
Tenali
YSRCP
Police

More Telugu News