mumbai: థానే రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట.. వీడియో వైరల్

crowd chaos near mumbai as passengers try to board overcrowded local train
  • ముంబైలో భారీ ఈదురుగాలులు, వర్షంతో ఒక్కసారిగా మారిన వాతావరణం
  • అస్తవ్యస్తమైన ట్రాఫిక్ .. రైలు సర్వీసులకు ఏర్పడ్డ అంతరాయం
  • రెండు గంటలపాటు నిలిచిపోయిన లోకల్ రైళ్లు.. అవస్థలుపడ్డ ప్రయాణికులు
దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు శివారు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ముంబైకర్లను ముప్పు తిప్పలు పెట్టింది. రోడ్డు, రైలు మార్గాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించింది. ముఖ్యంగా ముంబైకర్ల లైఫ్ లైన్ గా పిలిచే లోకల్ రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

థానే రైల్వే స్టేషన్ లో ఓ లోకల్ రైలు ఎక్కేందుకు ప్రయాణికులంతా ఒకేసారి దూసుకురావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అప్పటికే పూర్తిగా నిండిన రైలు ఎక్కేందుకు వందలాది మంది మహిళలు ప్లాట్ ఫాంపై తోసుకోవడం వీడియోలో కనిపించింది. దీంతో రైల్వే అధికారుల తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. ఇంత పెద్ద మహానగరానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక లేకపోవడం విచిత్రమని విమర్శించారు. 

మరోవైపు ఓ విద్యుత్ స్తంభం వంగిపోవడంతో సెంట్రల్ రైల్వే పరిధిలో రెండు గంటలకుపైగా రైలు సేవలను నిలిపేసినట్లు అధికారులు చెప్పారు. అలాగే పశ్చిమ రైల్వే పరిధిలో సిగ్నల్ వైఫల్యం వల్ల లోకల్ రైళ్లు 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడిచినట్లు వివరించారు. అలాగే మెట్రో లైన్ 7 మార్గంలో విద్యుత్ లైన్ పై భారీ ఫ్లెక్సీ పడటంతో రైలు సర్వీసులకు ఆటంకం కలిగినట్లు వివరించారు. దీంతో ముంబైకర్లు ఇళ్లకు చేరేందుకు పడరాని పాట్లు పడ్డారు. కొందరైతే పట్టాలపైనే నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది.
mumbai
storm
local trains
disrupted
passengers
chaos

More Telugu News