K Kavitha: మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

Kavitha Judicial remand extended till May 20
  • కవితను వర్చువల్‌గా కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు
  • మే 20వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
  • 8వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జిషీటును దాఖలు చేసిన ఈడీ
మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం పొడిగించింది. మే 20వ తేదీ వరకు ఆమె రిమాండ్‌ను పొడిగించింది. ఈడీ అధికారులు కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు.

ఈ కేసుకు సంబంధించి 8 వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జిషీటును దాఖలు చేశారు. దీంతో ఆమె రిమాండును పొడిగించింది. ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడంపై మే 20న విచారణ జరగనుంది. ఈడీ కేసులో నేటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. మద్యం పాలసీ కేసులో దర్యాఫ్తు కొనసాగుతోందని... కాబట్టి ఆమె రిమాండ్‌ను పొడిగించాలని ఈడీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
K Kavitha
Delhi Liquor Scam
ED
Arvind Kejriwal

More Telugu News