Kangana Ranaut: మండి లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన నటి కంగనా రనౌత్

Kangana Ranaut files nomination from Mandi for Lok Sabha elections
  • బీజేపీ అభ్యర్థిగా రాజకీయాల్లోకి అరంగేట్రం
  • తల్లి, సోదరితో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేసిన కంగనా
  • మండి ప్రజల ప్రేమే తనను సొంత రాష్ట్రానికి తీసుకువచ్చి పోటీ చేసేలా చేసిందని వ్యాఖ్య
ప్రముఖ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తన తల్లి ఆశా రనౌత్, సోదరి రంగోలి చందల్‌లతో కలిసి వచ్చి నామినేషన్ పత్రాలను సమర్పించారు. హిమాచలి క్యాప్ ధరించి ఆమె నామినేషన్ వేశారు. మండి ప్రజల ప్రేమే తనను సొంత రాష్ట్రానికి తీసుకు వచ్చి... పోటీ చేసేలా చేసిందన్నారు. తన రాజకీయ అరంగేట్రానికి కూడా వారే కారణమన్నారు.

నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, ఆమె ఏఎన్ఐతో మాట్లాడుతూ... 'ఈ రోజు నేను మండి లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశాను. మండి నుండి పోటీ చేసే అవకాశం నాకు లభించడం పట్ల గర్విస్తున్నాను. నేను బాలీవుడ్‌లో విజయం సాధించాను. ఇప్పుడు రాజకీయ రంగంలోనూ విజయం సాధిస్తాననే ఆశతో ఉన్నాను' అన్నారు.
Kangana Ranaut
BJP
Lok Sabha Polls

More Telugu News