London: లండన్‌లో అర్ధరాత్రి భారత సంతతి మహిళ హత్య

Indian origin woman stabbed to death in London attacker charged with murder
  • మే 9న ఎడ్గ్‌వేర్ ప్రాంతంలో దారుణం
  • బస్‌స్టాప్‌లో వేచి చూస్తున్న మహిళపై కత్తితో దాడి
  • తీవ్రగాయాలపాలై ఘటనాస్థలంలోనే మృతి చెందిన బాధితురాలు
  • నిందితుడిని అదే రోజు అరెస్టు చేసిన పోలీసులు
  • తాజాగా నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు
లండన్‌లో భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురయ్యింది. అర్ధరాత్రి బస్‌స్టాప్‌లో ఆమెను 22 ఏళ్ల యువకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. మే 9న ఈ దారుణం జరగ్గా నిందితుడిపై మంగళవారం హత్యా నేరం కింద కేసు నమోదైంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అనితా ముఖే నేషనల్ హెల్త్ సర్వీస్‌లో మెడికల్ సెక్రటరీగా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నారు. ఘటన జరిగిన రోజు ఆమె ఎడ్గ్‌వేర్ ప్రాంతంలోని బర్న్ట్ ఓక్ బ్రాడ్‌వే బస్ స్టాప్‌లో వేచి చూస్తుండగా జలాల్ డెబెల్లా అనే యువకుడు కత్తితో ఛాతి, మెడపై పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన సమాచారం అందగానే రంగంలోకి దిగిన పోలీసులు అదే రోజు నిందితుడిని అరెస్టు చేశారు.ఛాతి, గొంతుపై కత్తిపోట్ల కారణంగా అనిత మరణించినట్టు క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ పేర్కొంది. కాగా, మృతురాలికి భర్త, పిల్లలు, మనవలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
London
Indian Origin woman Murder
UK
Crime News

More Telugu News