Stock Market: స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్
- 117 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 17 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 1.84 శాతం పతనమైన ఏసియన్ పెయింట్స్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. మూడు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 117 పాయింట్ల నష్టంతో 72,987కి పడిపోయింది. నిఫ్టీ 17 పాయింట్లు కోల్పోయి 22,200 పాయింట్ల వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే మన కరెన్సీ విలువ రూ. 83.50గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.05%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.62%), ఎన్టీపీసీ (1.55%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.32%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.97%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-1.84%), టాటా మోటార్స్ (-1.81%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.57%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.21%), సన్ ఫార్మా (-1.10%).