Andhra Pradesh: సీఎస్ జవహర్‌రెడ్డితో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా స‌మావేశం

AP DGP Harishkumar Gupta Meeting with CS Jawahar reddy
  • పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్ర‌హం
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు సమన్లు
  • ఈ నేప‌థ్యంలోనే స‌చివాల‌యంలో సీఎస్‌, డీజీపీ అత్య‌వ‌స‌ర భేటీ
  • గురువారం ఢిల్లీ వెళ్లి వివ‌ర‌ణ ఇవ్వ‌నున్న సీఎస్‌, డీజీపీ
ఏపీలో పోలింగ్ త‌ర్వాత‌ పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై కేంద్ర‌ ఎన్నికల సంఘం (ఈసీఐ) సీరియ‌స్ అయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు సమన్లు జారీ చేసింది. ఏపీలో పోలింగ్ తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాల‌ని కోరింది. దీంతో స‌చివాల‌యంలో సీఎస్ జవహర్‌రెడ్డితో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా బుధ‌వారం అత్య‌వ‌స‌రంగా భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ కూడా పాల్గొన్నారు. కాగా, సీఎస్‌, డీజీపీ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది. పోలింగ్ త‌ర్వాత రాష్ట్రంలో నెల‌కొన్న‌ వాస్తవ పరిస్థితులను ఈసీకి వివరించనున్నారు.
Andhra Pradesh
DGP Harishkumar Gupta
CS Jawahar reddy

More Telugu News