Harish Rao: యాదగిరి గుట్టలో హరీశ్ రావు ప్రత్యేక పూజలు

Telangana Former Minister Harish Rao At Yadagiri Gutta Temple
  • సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్న మాజీ మంత్రి
  • రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వెల్లడి
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలంటూ గ్యాడ్యుయేట్లకు పిలుపు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు. ఉదయం తన అనుచరులతో కలిసి ఆలయానికి చేరుకున్న మాజీ మంత్రి.. లక్ష్మీనరసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్జిత సేవల్లో భాగంగా సుదర్శన నారసింహ హోమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డితో పాటు పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఐదు నెలల పాలనలో ప్రజలు కష్టాలపాలయ్యారని ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లకు హరీశ్ రావు పిలుపునిచ్చారు.
Harish Rao
BRS
Yadadri
Yadagiri Gutta
Graduate MLC Elections
Rakesh Reddy

More Telugu News