BRS: ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత మరో బెయిల్ పిటిషన్

brs mlc kavitha submits bail petition in delhi high court
  • సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని వినతి
  • మధ్యాహ్నం 12:30 గంటలకు విచారణ చేపట్టనున్న న్యాయస్థానం
  • ఇప్పటికే ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ప్రమేయమున్నట్లు ఆరోపిస్తూ ఈడీ, సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఆమె వేసిన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీలోని ట్రయల్ కోర్టు తోసిపుచ్చడం తెలిసిందే. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 

ఇప్పటికే ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన కవిత సీబీఐ నమోదు చేసిన కేసులోనూ బెయిల్ ఇవ్వాలని కోరుతూ గురువారం మరో పిటిషన్ వేశారు. 

ఈ పిటిషన్ పై మధ్యాహ్నం 12:30 గంటలకు విచారణ జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.
BRS
MLC
Kalvakuntla Kavitha
Delhi Liquor Scam
Bail Petition
Delhi High Court

More Telugu News