RS Praveen Kumar: అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే దాడులు: డీజీపీకి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RSP complaints to DGP over attacks on BRS in achampet
  • బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు
  • పోలీసుల సమక్షంలోనే విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారని మండిపాటు
  • మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డిలకు ప్రాణహాని ఉందని ఆందోళన
అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ ఆ పార్టీ నాగర్ కర్నూల్ లోక్ సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో కలిసి డీజీపిని ఆయన కలిశారు. ఫిర్యాదు అనంతరం ఆయన మాట్లాడుతూ... పోలీసుల‌ సమక్షంలోనే విచక్షణారహితంగా దాడులు చేశారని మండిపడ్డారు. అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసే ఇదంతా జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి అచ్చంపేటలోనే పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి... ఆయనకు తెలియకుండా జరుగుతుందని తాను అనుకోవడం లేదన్నారు. తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలకు ప్రాణహాని ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి దారుణాలు జరగలేదన్నారు.

తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని హర్షవర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దాడిలో గాయబడిన బాధితులు ఫిర్యాదు చేస్తే పట్టించుకునేవారే లేరన్నారు. గువ్వల బాలరాజుకు, త‌న‌కు ప్రాణహాని ఉందన్నారు. అందుకే రక్షణ కోరుతూ డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవన్నారు.  
RS Praveen Kumar
BRS
Lok Sabha Polls
TS DGP

More Telugu News