Bhanuprakash Reddy: జగన్ వెళ్లాల్సింది లండన్ కు కాదు.. యూపీకి వెళ్లాలి: భానుప్రకాశ్ రెడ్డి

Jagan has to go to UP not to London says Bhanuprakash Reddy
  • శాంతిభద్రతలను ఎలా కాపాడాలో సీఎం యోగి నుంచి తెలుసుకోవాలన్న భానుప్రకాశ్ రెడ్డి
  • వైసీపీని నమ్ముకున్న పోలీసు అధికారులు కెరీర్లో మచ్చ తెచ్చుకున్నారని వ్యాఖ్య
  • వైసీపీని రాష్ట్ర ప్రజలు తారు డబ్బాలో ముంచేశారన్న భాను
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాష్ట్ర బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ వెళ్లాల్సింది లండన్ కు కాదని... ఉత్తరప్రదేశ్ కు వెళ్లాలని చెప్పారు. శాంతిభద్రతలను ఎలా కాపాడాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి తెలుసుకోవాలని సూచించారు. యోగి సీఎం అయిన తర్వాత బెయిల్ పై బయట తిరుగుతున్న 11 వేల మంది క్రిమినల్స్... వారి బెయిల్ రద్దు చేసుకుని స్వతహాగా జైలుకు వెళ్లారని చెప్పారు. పోలీసులు ఉన్నా లెక్క చేయకుండా... దార్జన్యాలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని అన్నారు. గొడవలకు కర్త, కర్మ, క్రియగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తారు డబ్బాలో ముంచేశారని చెప్పారు. ఎంతో ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం రావణకాష్ఠంగా మార్చిందని మండిపడ్డారు. వైసీపీని నమ్ముకున్న ఎంతో మంది పోలీసు ఉన్నతాధికారులు వారి కెరీర్లో మచ్చ తెచ్చుకున్నారని చెప్పారు. పాత ఎఫ్ఐఆర్ లను కూడా మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడం అలాంటి అధికారులకు సిగ్గుచేటని అన్నారు.
Bhanuprakash Reddy
BJP
Jagan
YSRCP

More Telugu News