Hemant Soren: ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

SC Refuses To Consider Hemant Soren Plea For Interim Bail

  • ఎన్నికల ప్రచారం నిమిత్తం బెయిల్ మంజూరు చేయాలని హేమంత్ సోరెన్ పిటిషన్
  • సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు లిస్టింగ్ చేయాలని ఆదేశాలు
  • ఈ నెల 21న పిటిషన్‌పై విచారణ జరపనున్న ధర్మాసనం

మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఎన్నికల ప్రచారం నిమిత్తం తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు. దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

దీనిని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు లిస్టింగ్ చేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ నెల 21న ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపింది. భూకుంభకోణం కేసులో ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. తన అరెస్టును ఆయన ఝార్ఖండ్ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News