Nirmala Sitharaman: స్వాతి మాలివాల్‌పై దాడి ఘటన మీద కేజ్రీవాల్ మౌనం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది: నిర్మలా సీతారామన్
- మహిళా కమిషన్‌కు చైర్ పర్సన్‌గా చేసిన ఆమెకు ఈ పరిస్థితి ఎదురు కావడం దారుణమని వ్యాఖ్య
- స్వయంగా సీఎం నివాసంలోనే సొంత పార్టీ ఎంపీపై దాడి జరిగితే కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడలేదని విమర్శ
- ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని... కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి ఘటన మీద ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనంగా ఉండటం దిగ్భ్రాంతికి గురి చేస్తోందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మహిళా కమిషన్‌కు చైర్ పర్సన్‌గా చేసిన ఆమెకు ఈ పరిస్థితి ఎదురు కావడం దారుణమన్నారు. స్వయంగా సీఎం నివాసంలోనే సొంత పార్టీ ఎంపీపై దాడి జరిగితే కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉత్తర ప్రదేశ్ పర్యటనలో కేజ్రీవాల్ వెంట నిందితుడు కూడా ఉన్నట్లు తనకు తెలిసిందన్నారు. స్వాతి మాలివాల్‌కు ఎదురైన పరిస్థితి సిగ్గుచేటు అన్నారు. ఆమె ఫిర్యాదు చేయడానికే రోజుల సమయం పట్టిందంటే ఆమెపై ఒత్తిడి ఉన్నట్లుగా అర్థమవుతోందన్నారు.