BJP: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు

BJP MLAs meet CM Revanth Reddy
  • సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు
  • రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • సీఎంను కలిసిన వారిలో మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, రాకేశ్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేశ్ రెడ్డిలు ఉన్నారు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. 

సాగునీటి శాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష

సాగునీటి శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై వారు చర్చించారు.
BJP
Revanth Reddy
Paidi Rakesh Reddy
Maheshwar Reddy

More Telugu News