ISRO: దేవాలయాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయాలి: ఇస్రో చైర్మన్ సూచన

ISRO Chairman Advises What Temples Should Do To Attract Youth In India

  • ఆలయ నిర్వాహకులు యువతను దేవాలయాలకు ఆకర్షించాలన్న సోమనాథ్
  • ఇందుకోసం దేవాలయాల్లో లైబ్రరీలను ఎందుకు ఏర్పాటు చేయకూడదని వ్యాఖ్య
  • సాయంత్రం వేళల్లో వివిధ అంశాలపై చర్చలు ఏర్పాటు చేయాలన్న సోమనాథ్

దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. గ్రంథాలయాల ఏర్పాటుతో యువతను దేవాలయాల బాట పట్టించవచ్చునన్నారు. తిరువనంతపురంలోని శ్రీ ఉడియన్నూర్ దేవి ఆలయం సభ్యులు సోమనాథ్‌ను సన్మానించారు. ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ... అవార్డు ప్రదానోత్సవానికి చాలామంది వస్తారని భావించానని... కానీ అలా జరగలేదన్నారు. ఆలయ నిర్వాహకులు యువతను దేవాలయాలకు ఆకర్షించాలన్నారు. ఇందుకోసం దేవాలయాల్లో లైబ్రరీలను ఎందుకు ఏర్పాటు చేయకూడదన్నారు.

ఆలయాలు కేవలం వృద్ధులు వచ్చి దేవుడిని తలుచుకునేవిగా కాకుండా... సమాజాన్ని మార్చే ప్రభావవంతమైన ప్రదేశాలుగా మారాలన్నారు. ఇలా చేయడం వల్ల ధార్మిక విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు, ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలనుకునే వారు దేవాలయాలకు రావడానికి ఆసక్తి చూపిస్తారన్నారు. సాయంత్రం వేళల్లో వివిధ అంశాలపై చర్చలు ఏర్పాటు చేయాలని... ఇది యువత తమ అభివృద్ధికి బాటలు వేసేలా ఉపయోగపడుతుందన్నారు.

  • Loading...

More Telugu News