Rachamallu Sivaprasad Reddy: ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు

Police case filed on Proddutur YCP MLA Rachamallu Sivaprasad Reddy
  • నిన్న వైసీపీ కార్యకర్తలను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు
  • స్టేషన్ కు వెళ్లి ఓ కార్యకర్తను బయటికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే రాచమల్లు
  • విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ ఫిర్యాదుతో కేసు నమోదు
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే రాచమల్లు బావమరిది మునిరెడ్డిపైనా కేసు నమోదైంది. సీఐని బెదిరించి విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ రూపొందించారు. 

నిన్న ప్రొద్దుటూరు పోలీసులు కొందరు వైసీపీ కార్యకర్తలను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు పోలీసుల అనుమతి లేకుండా ఓ వైసీపీ కార్యకర్తను పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకువచ్చారు. 

ఈ నేపథ్యంలో, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ ఫిర్యాదుతో ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు చేశారు.
Rachamallu Sivaprasad Reddy
Police Case
CI
YSRCP
Proddutur

More Telugu News