Prashant Kishor: ఏపీలో గెలుపు టీడీపీదే: ప్రశాంత్ కిశోర్

Prashanth Kishor predicts TDP win in upcoming election
  • వైసీపీకి ఘోర పరాజయం తప్పదన్న ఎన్నికల వ్యూహకర్త
  • ప్రముఖ పాత్రికేయురాలు బర్ఖాదత్‌తో ఇంటర్వ్యూ
  • ఫలితాలకు ముందు ఎవరూ ఓటమిని అంగీకరించరని వ్యాఖ్య
  • బీజేపీపై ప్రజలకు అసంతృప్తి తప్ప కోపం లేదన్న ప్రశాంత్ కిశోర్
  • బీజేపీదే విజయమని స్పష్టీకరణ
ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. వైసీపీకి పరాజయం తప్పదని పేర్కొన్నారు. ప్రముఖ పాత్రికేయురాలు బర్ఖాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెబుతున్నారని అన్నారు. 

పదేళ్లుగా తాను ఎన్నికల క్షేత్రంలో ఉన్నానని, కానీ ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన వారిని తాను ఇంతవరకూ చూడలేదని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు రోజు నాలుగు రౌండ్లు పూర్తయిన తరువాత కూడా మున్ముందు రౌండ్లలో తమకు మెజార్టీ వస్తుందని, ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేస్తారని అన్నారు. చంద్రబాబు గెలుస్తామని చెబితే.. గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని జగన్ అంటున్నారని, ఈ చర్చకు అంతమే ఉండదని ప్రశాంత కిశోర్ పేర్కొన్నారు. ఇక బీజేపీకి లోగడ కంటే సీట్లు తగ్గవన్నారు. బీజేపీ, మోదీలపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా ఆగ్రహం లేదని చెప్పారు. కాబట్టి ఈసారి బీజేపీకి 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ, లేదంటే అంతకంటే ఎక్కువగానీ సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Prashant Kishor
Andhra Pradesh
Telugudesam
Chandrababu
YSRCP
YS Jagan

More Telugu News