Driving License: డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేది ఇక ప్రైవేటు సంస్థలే.. జూన్ 1 నుంచే అమల్లోకి!

From June driving license issued by private centers
  • కొత్త నిబంధనలు జారీచేసిన కేంద్రం
  • ఇకపై ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పినట్టే
  • శిక్షణ పూర్తిచేసుకున్న సంస్థలోనే లైసెన్స్
  • శిక్షణ ఇచ్చే సంస్థకు మూడెకరాల స్థలం తప్పనిసరి
  • థియరీ, ప్రాక్టికల్ రూపంలో శిక్షణ
  • ట్రైనర్ కనీసం హైస్కూలు విద్యను పూర్తిచేసి ఉండాలని నిబంధన
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారా? ఇకపై మీకా బాధ అక్కర్లేదు. జూన్ 1 నుంచి ప్రైవేటు శిక్షణ సంస్థలే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ చేతికి అందిస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో కేంద్రం భారీ మార్పులు చేస్తూ నిబంధనలు జారీచేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే ఇది అమల్లోకి వస్తుంది.

శిక్షణ సంస్థకు ఉండాల్సిన అర్హతలు
ప్రైవేటు సంస్థలకు డ్రైవింగ్ సర్టిఫికెట్ జారీచేసేందుకు అనుమతినిచ్చిన కేంద్రం అందుకు కొన్ని నిబంధనలు విధించింది. ఆయా సంస్థలకు కనీసం ఎకరం భూమి ఉండాలి. ఫోర్ వీలర్ డ్రైవింగ్ శిక్షణ కోసం అదనంగా మూడు ఎకరాల భూమి ఉండాలి. ముఖ్యంగా ఆ సెంటర్ అందరికీ అందుబాటులో ఉండాలి. రాకపోకలకు ఎలాంటి అంతరాయమూ ఉండకూడదు. శిక్షణ ఇచ్చే వారు కనీసం హైస్కూలు విద్యను పూర్తిచేసి ఉండాలి. డ్రైవింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్, టెక్నాలజీపై ప్రాథమిక అవగాహన ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ప్రభుత్వం ఆయా సంస్థలకు అనుమతినిస్తుంది.

శిక్షణ కాలం
లైట్ వెహికల్ ట్రైనింగ్‌ను కచ్చితంగా 4 వారాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కనీసం 29 గంటల శిక్షణ ఇవ్వాలి. ఇది థియరీ, ప్రాక్టికల్ రూపంలో ఉండాలి. థియరీలో 8 గంటలు, ప్రాక్టికల్‌లో 21 గంటల శిక్షణ ఇవ్వాలి. హెవీ మోటార్ వాహనాల డ్రైవింగ్‌కు ఆరువారాలపాటు కనీసం 39 గంటల ట్రైనింగ్ ఇవ్వాలి. ఇందులో 8 గంటల థియరీ, 31 గంటల ప్రాక్టికల్ తరగతులు ఉండాలి.

ఫీజులు ఇలా
లెర్నర్ లైసెన్స్ : రూ. 200
లెర్నర్ లైసెన్స్ రెన్యువల్: రూ. 200
పర్మినెంట్ లైసెన్స్: రూ. 200
ఇంటర్నేషనల్ లైసెన్స్: రూ. 1000
Driving License
RTO
License Test
Driving Trining
Trining Centers

More Telugu News