Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ పిటిషన్

ED moves court and seeks 14 day extension of Kejriwal judicial custody
  • కేజ్రీవాల్ కస్టడీని 14 రోజులు పొడిగించాలని కోరుతూ ఈడీ పిటిషన్
  • ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి
  • జూన్ 2న కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉన్న తరుణంలో ఈడీ పిటిషన్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఆయన కస్టడీని 14 రోజులు పొడిగించాలని కోరింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఆయన జూన్ 2న కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. మద్యం పాలసీ కేసులో ఈడీ ఆయనను మార్చి 21న అరెస్ట్ చేసింది.

కేంద్ర ఏజెన్సీ గతవారం మద్యం పాలసీ కేసులో అదనపు ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీని నిందితులుగా పేర్కొంది. ఓ సిట్టింగ్ ముఖ్యమంత్రి, ఓ రాజకీయ పార్టీ మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి.
Arvind Kejriwal
Lok Sabha Polls
Delhi Liquor Scam

More Telugu News