ISIS terrorists arested: ఆత్మాహుతి దాడులు చేసేందుకు దేశంలోకి ఐసిస్ ఉగ్రవాదులు.. గుజరాత్ లో అరెస్ట్!

ISIS terrorists caught in Gujarat had Jewish sites Hindu leaders on target
  • మే 19న అహ్మదాబాద్‌లో పోలీసులకు చిక్కిన నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు
  • యూదు, హిందూ దేవాలయాలు, బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ నేతలను టార్గెట్‌ చేసుకున్న వైనం
  • ఆత్మాహుతి దాడులు చేయాలని దేశంలోకి ఉగ్రవాదులు కాలుపెట్టినట్టు సమాచారం
  • నిందితులను శ్రీలంక జాతీయులుగా గుర్తింపు
  • పాక్‌లో కరుడుగట్టిన ఉగ్రవాది అబూతో టచ్‌లో నిందితులు
ఇటీవల గుజరాత్‌లో పోలీసులకు చిక్కిన నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు.. యూదు, హిందూ దేవాలయాలపై దాడులు చేసేందుకు దేశంలోకి వచ్చినట్టు తెలిసింది. మే 19న అహ్మదాబాద్‌లో గుజరాత్ పోలీస్ శాఖకు చెందిన ఉగ్రవాద నిరోధక బృందం నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. నిందితులను ముహమ్మద్ నుస్రత్, ముహమ్మద్ నఫ్రాన్, ముహమ్మద్ ఫారిస్, ముహమ్మద్ రస్దీన్‌గా గుర్తించారు. శ్రీలంక జాతీయులైన నిందితులు కొలొంబో నుంచి చెన్నై మీదుగా అహ్మదాబాద్‌కు చేరుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లో ఆత్మాహుతి దాడులు చేసేందుకు వీరు వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పాక్‌లోని ఐసిస్ ఉగ్రవాది అబుతో నిందితులు నిరంతరం టచ్‌లో ఉన్నట్టు కూడా తెలుసుకున్నారు. 

భారత్‌లోని యూదు, హిందూ దేవాలయాలతో పాటు కొందరు బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ ప్రముఖులే టార్గెట్‌గా ఆత్మాహుతి దాడులు చేయాలనేది వీరి ప్లాన్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. పట్టుబడ్డ ఉగ్రవాదుల్లో ఒకరికి పాక్ వీసా కూడా ఉందని, అతడు అక్కడ తన హ్యాండ్లర్‌ను కలుసుకోవాల్సి ఉందని సమచారం. భారత్‌లో కొందరితో ఉగ్రవాదులు సంప్రదింపులు జరిపి ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
ISIS terrorists arested
Gujarat
Sri Lanka

More Telugu News