Sambit Patra: నోరు జారిన సంబిత్ పాత్ర.. పూరి జగన్నాథుడు మోదీ భక్తుడంటూ షాకింగ్ కామెంట్

Sambit patra slip of tongue calls puri jagannath modis bhakhth
  • పూరీ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ నేత సంబిత్ పాత్రా
  • పూరీ జగన్నాథుడు ప్రధాని మోదీ భక్తుడంటూ నోరు జారిన వైనం
  • ఈ కామెంట్స్‌పై భగ్గుమన్న ఒడిశా సీఎం, దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని హితవు
  • పొరపాటున ఈ కామెంట్స్ చేశానని సందీప్ పాత్రా విచారం
  • చిన్న విషయాన్ని పెద్దది చేయొద్దని సూచన
ఒడిశాలోని పూరి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న బీజేపీ నేత సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారీతీశాయి. ఏకంగా ఓడిశా ముఖ్యమంత్రి కూడా సంబిత్ పాత్రాపై సీరియస్ కావడంతో ఆయన వివరణ ఇచ్చారు. పొరపాటు జరిగిందని పేర్కొన్న సంబిత్ పాత్రా.. ఈ విషయాన్ని పెద్దది చేయాల్సిన అవసరం లేదన్నారు. 

ఓడిశాలో మీడియాతో మాట్లాడుతూ సంబిత్ పాత్రా వివాదాస్పద కామెంట్ చేశారు. ‘‘ఈ రోజు మోదీని చూసేందుకు కొన్ని లక్షల మంది ఇక్కడకు వచ్చారు. జగన్నాథుడు కూడా మోదీ భక్తుడే. మనమంతా మోదీ కుటుంబసభ్యులమే. ఒడిశా ప్రజలకు ఇంత ముఖ్యమైన రోజున నేను భావోద్వేగాన్ని అణచుకోలేకపోతున్నా’’ అని మాట్లాడారు. అయితే, పూరీ జగన్నాథుడిని మోదీ భక్తుడనటం వివాదానికి దారి తీసింది. 

ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సీరియస్ అయ్యారు. ‘‘ఒడిశా ఆత్మాభిమానానికి మహాప్రభు పూరీ జగన్నాథ్ చిహ్నం. పూరీ జగన్నాథుడు ఓ మనిషికి భక్తుడని వ్యాఖ్యానించడాన్ని నేను ఖండిస్తున్నాను. మహాప్రభును రాజకీయాల్లోకి లాగొద్దని నేను బీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వ్యాఖ్యలు ఒడియా ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి. దీన్ని వారు చాలా కాలం పాటు గుర్తుపెట్టుకుంటారు’’ అని ఎక్స్ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు. 

కాగా, సీఎం పోస్టుపై సంబిత్ పాత్రా కూడా స్పందించారు. ‘‘ఈ మధ్య కాలంలో తాను చాలా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చానని, అందులో ప్రధాని మోదీ పూరి జగన్నాథ్ భక్తుడని పేర్కొన్నానని తెలిపారు. ఏదో ఒక్కసారి పొరపాటున నోటి వెంట ఈ వ్యాఖ్యలు వచ్చినట్టు పేర్కొన్నారు. చిన్న విషయాన్ని పెద్దది చేయొద్దని ఒడిశా సీఎంకు విజ్ఞప్తి చేశారు.
Sambit Patra
Narendra Modi
Puri Jagannath
Odisha
Naveen Patnaik

More Telugu News