CPI Narayana: ఏపీలో అరాచకాలు జరుగుతుంటే జగన్, చంద్రబాబు విదేశాలకు వెళ్లడం ఏంటి?: సీపీఐ నారాయణ

CPI Narayana questioned about Jagan and Chandrababu going on a foreign trip
  • ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు
  • జగన్, చంద్రబాబు విదేశాలకు వెళ్లడం బాధ్యతా రాహిత్యమన్న నారాయణ
  • ఏపీలో అల్లర్లపై సిట్ వేయడం దండగ అని వెల్లడి
  • రాష్ట్రంలో హింసపై అఖిలపక్షం వేసి, జ్యుడిషియల్ విచారణ జరపాలని డిమాండ్
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ రాజకీయ పరిణామాలపై స్పందించారు. రాష్ట్రంలో అల్లర్లు, అరాచకాలు జరుగుతుంటే జగన్, చంద్రబాబు విదేశాలకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. నాయకులకు ఉండాల్సిన లక్షణం ఇది కాదని అన్నారు. జగన్ లండన్ వెళ్లారని, చంద్రబాబు అమెరికా వెళ్లారని... వారిద్దరిదీ బాధ్యతా రాహిత్యమని విమర్శించారు. 

ఏపీలో అల్లర్లపై సిట్ వేయడం వల్ల ఉపయోగం లేదని, ఇటీవలి హింసపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం జరిగిన ఘటనలపై జ్యుడిషియల్ విచారణ జరగాలని స్పష్టం చేశారు.
CPI Narayana
Jagan
Chandrababu
Andhra Pradesh

More Telugu News