Pinnelli Ramakrishna Reddy: పోలింగ్ స్టేషన్ బయట మహిళపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి దుర్భాషలు.. వేలు చూపించి జాగ్రత్త అని హెచ్చరిక.. వీడియో ఇదిగో!

Another video of YCP MLA Pinnelli out here is the video
  • వరుసగా వెలుగులోకి పిన్నెల్లి వీడియోలు
  • నిన్న ఈవీఎంలను పగలగొట్టిన వీడియో
  • నేడు మహిళను హెచ్చరిస్తున్న వీడియో
ఎన్నికలు జరుగుతుండగా అనుచరులతో కలిసి పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్  బూత్‌లోకి వెళ్లి ఈవీఎంను పగలగొట్టిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో బయటకు వచ్చి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇప్పుడు మరో వీడియో బయటకు వచ్చింది. 

పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పగలగొట్టి బయటకు వచ్చిన పిన్నెల్లిని ఓ మహిళ నిలదీసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పిన్నెల్లి ఆమెను దుర్భాషలాడుతూ వేలు చూపించి బెదిరించారు. తాజాగా ఈ వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది.
Pinnelli Ramakrishna Reddy
YSRCP
Palnadu
Viral Videos
Andhra Pradesh

More Telugu News