Landslide: గాఢ నిద్రలో ఉండగా విరుచుకుపడిన కొండచరియలు.. పాపువా న్యూగినియాలో 100 మందికిపైగా మృతి

More than 100 dead in Papua New Guinea landslide
  • తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘటన
  • నిద్రలోనే సమాధి అయిన గ్రామస్థులు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
పాపువా న్యూగినియాలో కొండచరియలు విరిగిపడి 100 మందికిపైగా మృతి చెందారు. ఓ గ్రామంపై విరుచుకుపడిన కొండచరియలు ఇళ్లను సమూలంగా నేలమట్టం చేశాయి. రాజధాని పోర్ట్ మోరెస్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని కావోకలం గ్రామంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

గ్రామస్థులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో కొండచరియలు విరిగి పడడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారులు మాత్రం ఇప్పటి వరకు మృతుల సంఖ్యపై ప్రకటన చేయలేదు. అలాగే, సహాయక కార్యక్రమాలపైనా స్పష్టత లేదు.  ప్రధాని జేమ్స్ మార్పే బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Landslide
Papua New Guinea
Kaokalam
James Marape

More Telugu News