Jagga Reddy: రేవంత్ రెడ్డికి ఐదేళ్లు ఢోకా లేదు... ముఖ్యమంత్రిని ఎవరూ ఏమీ చేయలేరు: జగ్గారెడ్డి

Jagga Reddy welcomes kishan reddy comments
  • 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానన్న జగ్గారెడ్డి
  • బీజేపీ నుంచి కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని వ్యాఖ్య
  • కేటీఆర్, హరీశ్ రావులు ముఖ్యమంత్రిపై బురద జల్లుతున్నారని ఆగ్రహం
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఐదేళ్లు ఢోకా లేదని... ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రిని ఏమీ చేయలేరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ నేతలు ప్రభుత్వాలను పడగొట్టడంలో ప్రొఫెసర్లు అని ఎద్దేవా చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానన్నారు. అయితే బీజేపీ నుంచి కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ముఖ్యమంత్రిపై బురద జల్లుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా బీజేపీ, బీఆర్ఎస్ శత్రువులే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ఏనాడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదన్నారు. తెలంగాణలో ఎప్పుడూ హత్యా రాజకీయాలు జరగలేదన్నారు.
Jagga Reddy
Revanth Reddy
Congress
G. Kishan Reddy
BJP

More Telugu News