Train Crossing Speed Limit: అపరిమిత వేగంతో రైళ్లు నడిపిన లోకోపైలట్‌‌లపై వేటు

Railways suspends locopilots for crossing speed limits of gatimaan malwa express trains

  • ఆగ్రా కంటోన్మెంట్ సమీపంలోని జజువా, మానియా రైల్వే స్టేషన్ల మధ్య ఘటన
  • పునరుద్ధరణ పనులు జరుగుతున్న వంతెనపై గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని ఆంక్షలు
  • పరిమితికి మించి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన గతిమాన్ ఎక్స్ ప్రెస్, 
  • మాల్వా ఎక్స్ ప్రెస్ కూడా పరిమితికి మించిన వేగంతో వెళ్లిన వైనం
  • బాధ్యులైన లోకోపైలట్లపై సస్పెన్షన్ వేటు

పరిమితికి మించిన వేగంతో రైళ్లను నడిపి ప్రయాణికులను ప్రమాదపు అంచుల వరకూ తీసుకెళ్లిన లోకోపైలట్లపై రైల్వే శాఖ వేటు చేసింది. గతిమాన్, మాల్వా ఎక్స్‌ప్రెస్ రైళ్ల లోకోపైలట్లను ఈ మేరకు రైల్వే శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 

ఆగ్రా కంటోన్మెంట్‌కు సమీపంలోని జజువా, మానియా రైల్వే స్టేషన్ల మధ్య ఓ రైల్వే వంతెన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వంతెనపై రైలు గంటకు 20 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాలని రైల్వే అధికారులు నిర్దేశించారు. అయితే, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఇటీవల ఈ వంతెనపై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఆ తరువాత మరో రెండు మూడు రోజులకు మాల్వా ఎక్స్‌ప్రెస్ కూడా పరిమితికి మించిన వేగంతో ప్రయాణించింది. 

అయితే, ముందస్తు హెచ్చరికల గురించి సహాయక లోకోపైలట్‌కు గట్టిగా చెబుతారని, వాటిని లోకోపైలట్ తిరిగి చెప్పే విధానం ఉంటుందని రైల్వే అధికారులు అన్నారు. అయినా కూడా ఈ తప్పిదం జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వంతెనపై రైలు నెమ్మదిగా నడపాల్సిన విషయాన్ని వారు మర్చిపోయినట్టు కనిపిస్తున్నట్టు భావిస్తున్నారు. అయితే, వందలాది మంది ప్రయాణికులను ప్రమాదం అంచుల వరకూ తీసుకెళ్లిన నేపథ్యంలో శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News