Sixth Phase Polling: ముగిసిన ఆరో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్
- దేశంలో ఈసారి ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు
- నేడు ఆరో దశ పోలింగ్
- 58 లోక్ సభ స్థానాలకు ఇవాళ ఓటింగ్
- 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్
- ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహిస్తుండగా, నేడు ఆరో దశ పోలింగ్ చేపట్టారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 6 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.
కాగా, ఇవాళ ఆరో దశలో 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. 58 లోక్ సభ స్థానాల్లో 889 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఉత్తరప్రదేశ్ లో 14, హర్యానాలో 10, బీహార్ లో 8, పశ్చిమ బెంగాల్ లో 8, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, ఝార్ఖండ్ లో 4, జమ్మూ కశ్మీర్ లో 1 లోక్ సభ స్థానాలకు నేడు ఆరో విడతలో పోలింగ్ చేపట్టారు.
సాయంత్రం 5 గంటల సమయానికి 57.7 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. అత్యధికంగా బెంగాల్ లో 77.99 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఢిల్లీలో 53.73 శాతం ఓటింగ్ నమోదైంది.