IPL 2024: ఐపీఎల్ ప్రైజ్‌మనీ.. ఎవరెవరికి ఎంతంటే..!
- టైటిల్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ.20 కోట్లు
- రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్‌కు రూ.12.5 కోట్లు
- ఆరెంజ్ క్యాప్ విన్నర్ విరాట్ కోహ్లీకి రూ.10 లక్షలు
- పర్పుల్ క్యాప్ విజేత హర్షల్ పటేల్‌కు రూ.10 లక్షలు
- ఉత్తమ పిచ్ అండ్ గ్రౌండ్‌గా ఎంపికైన ఉప్పల్ స్టేడియానికి రూ. 50 లక్షలు
ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఛాంపియన్‌గా నిలిచింది. చెన్నై వేదికగా సన్ రైజర్స్ (ఎస్ఆర్‌హెచ్) తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచులో కేకేఆర్ ఎనిమిది వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 10.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో కోల్‌కతా దాదాపు దశాబ్దం తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఇక ఫైనల్‌లో పేలవ ప్రదర్శనతో పరాజయం మూటగట్టుకున్న ఎస్ఆర్‌హెచ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
కాగా, టైటిల్ విజేత, రన్నరప్‌తో పాటు టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ దక్కింది. విన్నర్‌గా నిలిచిన కేకేఆర్ అత్యధికంగా రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. అలాగే రన్నరప్ సన్ రైజర్స్ రూ. 12.5 కోట్లు అందుకుంది. ఆరెంజ్ క్యాప్ విజేత విరాట్ కోహ్లీ, పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్ చెరో రూ. 10 లక్షలు గెలుచుకున్నారు.
ఉప్పల్ స్టేడియానికి అవార్డు
ఇక ఉత్తమ పిచ్ అండ్ గ్రౌండ్‌గా ఎంపికైన ఉప్పల్ స్టేడియానికి రూ. 50 లక్షలు దక్కాయి. నిన్నటి ఫైనల్ అనంతరం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరి నాథ్ నుంచి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఈ అవార్డును స్వీకరించారు. ఆయనకు ప్రోత్సాహకంగా రూ. 50 లక్షల నగదు అందజేశారు. కాగా, ఈ సీజన్‌లో ఉప్పల్ స్టేడియంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఇంకా ఎవరెవరికి ఎంత దక్కిందో ఇప్పుడు తెలుసుకుందాం.
2024 ఐపీఎల్ ప్రైజ్‌మనీ
ఛాంపియన్: కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ.20 కోట్లు)
రన్నరప్: సన్ రైజర్స్ హైదరాబాద్ (రూ.12.5 కోట్లు)
ఆరెంజ్ క్యాప్: విరాట్ కోహ్లీ (రూ.10 లక్షలు)
పర్పుల్ క్యాప్: హర్షల్ పటేల్ (రూ.10 లక్షలు)
ఎమర్జింగ్ ప్లేయర్: నితీశ్ రెడ్డి (రూ.10 లక్షలు)
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (234.4 స్ట్రైక్ రేట్)- రూ.10 లక్షలు
అత్యంత విలువైన ఆటగాడు: సునీల్ నరైన్ (రూ.10 లక్షలు)
ఫాంటసీ ప్లేయర్: సునీల్ నరైన్ (రూ.10 లక్షలు)
క్యాచ్ ఆఫ్ ది సీజన్: రమణ్దీప్ సింగ్ (రూ.10 లక్షలు)
ఫెయిర్ ప్లే అవార్డు: సన్ రైజర్స్ హైదరాబాద్ (రూ.10 లక్షలు)
అత్యధిక సిక్స్లు: అభిషేక్ శర్మ (42 సిక్స్లు)- రూ.10 లక్షలు
అత్యధిక ఫోర్లు: ట్రావిస్ హెడ్ (64 ఫోర్లు)- రూ.10 లక్షలు
బెస్ట్ గ్రౌండ్ అండ్ పిచ్: ఉప్పల్ స్టేడియం (రూ.50 లక్షలు)
ఐపీఎల్ ఫైనల్ 2024 అవార్డులు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మిచెల్ స్టార్క్ (రూ. 5 లక్షలు)
అల్టిమేట్ ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మిచెల్ స్టార్క్ (రూ. 1 లక్ష)
ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్: వెంకటేష్ అయ్యర్ (రూ. 1 లక్ష)
గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది మ్యాచ్: హర్షిత్ రాణా (రూ. 1 లక్ష)
మ్యాచ్‌లో అత్యధిక ఫోర్లు: రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. 1 లక్ష)
మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు: వెంకటేష్ అయ్యర్ (రూ. 1 లక్ష)