Renu Desai: ఇది నేనేనంటే నమ్మలేకపోతున్నా.. జానీ సినిమా వీడియో క్లిప్ షేర్ చేసిన రేణు దేశాయ్

Renu Desai Insta Post went viral in Social Media
  • తన బర్త్ డేకు కొడుకు అకీరా ఇచ్చిన గిఫ్ట్ అంటూ వ్యాఖ్య
  • పవన్ పై ప్రేమను ఇలా చూపించిందంటున్న ఫ్యాన్స్
  • సోషల్ మీడియాలో వైరల్ గా రేణు దేశాయ్ ఇన్ స్టా పోస్ట్
మాజీ హీరోయిన్ రేణు దేశాయ్ ఇన్ స్టా పోస్టు వైరల్ గా మారింది. మాజీ భర్త పవన్ తో కలిసి చేసిన జానీ సినిమాలోని ఓ క్లిప్ ను రేణు షేర్ చేసింది. ఇందులో ఉన్నది నేనేనంటే నమ్మలేకపోతున్నా అంటూ క్యాప్షన్ జోడించింది. తన పుట్టిన రోజు సందర్భంగా కొడుకు అకీరా నందన్ ఇచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్ అంటూ ఎడిట్ చేసిన వీడియో క్లిప్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అందమైన అమ్మాయి అంటూ రెండు లవ్ సింబల్స్ ను వీడియోకు జోడించింది. ఈ వీడియో చూసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. తమ హీరో మీద ప్రేమను ఇలా పరోక్షంగా చెప్పిందంటూ మురిసిపోతున్నారు.

బద్రి సినిమాలో జంటగా నటించిన పవన్, రేణు దేశాయ్ ఆ తర్వాత జానీ సినిమాలోనూ జంటగా కనిపించారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు అకీరా, ఆద్యలు జన్మించారు. అయితే, మనస్పర్థల కారణంగా పవన్, రేణు విడాకులు తీసుకున్నారు. ఆపై పవన్ మరో వివాహం చేసుకోగా.. రేణు మాత్రం తన పిల్లల పెంపకంపై దృష్టి పెట్టింది. పిల్లలు పెద్దవారు కావడంతో ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే సినిమాతో రేణు దేశాయ్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
Renu Desai
Pawan Kalyan
Akira nandan
Jhonney Movie
Renu Insta
Viral Videos

More Telugu News