Dandruff: చుండ్రుకు నివారణ మార్గాలు సరే.. అసలు అది ఎందుకొస్తుంది?
- సాధారణంగా అందరికీ ఉండే సమస్యల్లో ఇది కూడా ఒకటి
- ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసే చుండ్రు సమస్య
- తీసుకునే ఆహారం వల్ల కూడా వచ్చే అవకాశం
సాధారణంగా అందరికీ ఉండే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. మిగతా సమస్యల సంగతేమో కానీ, ఇది మానసికంగానూ మనల్ని దెబ్బతీస్తుంది. చుండ్రుతో బాధపడేవారు పదిమందిలోకి వెళ్లేందుకు జంకుతారు. భుజాలపై రాలుతూ అసహ్యంగా కనిపించడమే అందుకు కారణం. చుండ్రు నివారణకు చాలానే దారులు ఉన్నాయి.
చుండ్రు వచ్చాక తీరిగ్గా దానిని నివారించే మార్గాలు వెతుక్కోవడం కంటే అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మేలు. చుండ్రు అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. అసలు ఇది ఎందుకు వస్తుంది? ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది? ఇవి కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.