Hyderabad: హైద‌రాబాద్‌లో చిన్నారుల‌ను విక్ర‌యిస్తున్న అంత‌ర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌!

Interstate gang selling children arrested in Hyderabad
  • ముఠా నుంచి 16 మంది చిన్నారుల‌ను కాపాడిన‌ మేడిప‌ల్లి పోలీసులు 
  • వీరిలో చాలా మంది ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన పిల్ల‌లు ఉన్న‌ట్లు గుర్తింపు
  • ఈ ముఠా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 16 మంది చిన్నారుల‌ను విక్ర‌యించిన‌ట్లు నిర్ధార‌ణ‌
హైద‌రాబాద్ న‌గ‌రంలో చిన్నారుల‌ను విక్ర‌యిస్తున్న అంత‌ర్రాష్ట్ర ముఠాను మంగ‌ళ‌వారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద ఉన్న‌ 16 మంది చిన్నారుల‌ను మేడిప‌ల్లి పోలీసులు రక్షించారు. వీరిలో చాలా మంది ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన పిల్ల‌లు ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. 

ఇటీవ‌ల మేడిప‌ల్లిలో ఓ చిన్నారి విక్ర‌యంతో ఈ ముఠా గుట్టుర‌ట్ట‌యింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ముఠా మొత్తం 16 మంది చిన్నారుల‌ను విక్ర‌యించిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఫిర్జాదిగూడ‌లో నాలుగున్న‌ర ల‌క్ష‌ల‌కు ఓ న‌వ‌జాత శిశువును ఆర్ఎంపీ శోభారాణి అమ్మారు. దీంతో ఆర్ఎంపీని ఆమెకు స‌హ‌క‌రించిన మ‌రో ఇద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.
Hyderabad
Interstate gang
Arrest
Telangana
Crime News

More Telugu News