Sonia Gandhi: సోనియాగాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం

Revanth Reddy meeting with Sonia Gandhi

  • రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
  • దాదాపు అరగంటపాటు జరిగిన సమావేశం
  • అంతకుముందు, కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆమెను ఆహ్వానించారు. దాదాపు అరగంటపాటు ఈ సమావేశం జరిగింది. అంతకుముందు, ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఆయననూ వేడుకలకు ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తయినందున అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News