Postal Ballots: పోస్టల్ బ్యాలెట్లు చెల్లకపోతే ఆర్వోలదే బాధ్యత: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

Govt employees concerns on postal ballots validation

  • పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఉద్యోగుల్లో అయోమయం
  • ఉద్యోగుల ఓట్లు చెల్లకపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారన్న సూర్యనారాయణ
  • ఉద్యోగుల ఓటు చెల్లుబాటు అయ్యేలా ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి 
  • పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సరళతరం చేయాల్సి ఉందని సూచన

పోస్టల్ బ్యాలెట్ల అంశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లు చెల్లకపోతే ఆ బాధ్యత ఆర్వోలదేనని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ స్పందిస్తూ... ఉద్యోగుల ఓట్లు చెల్లకపోతే బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ప్రశ్నించారు. 

ఉద్యోగుల ఓటు చెల్లుబాటు అయ్యేలా ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల ఓటు హక్కు వినియోగాన్ని సంక్లిష్టంగా మార్చుతున్నారని సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ తెలిసిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సమంజసమేనా? పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సరళతరం చేయాల్సి ఉంది అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News