Mallikarjun Kharge: తెలంగాణ సహా ఆ రాష్ట్రాల్లో బీజేపీ ఉనికిలోనే లేదు... 400 సీట్లు ఎలా సాధిస్తుంది?: ఖర్గే ప్రశ్న

BJP 400 paar claim bakwas wont cross 200 seats says Congress chief Kharge

  • కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉనికిలోనే లేదన్న మల్లికార్జున ఖర్గే
  • గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ సీట్లను కోల్పోతుందని జోస్యం
  • ఇండియా కూటమి పుంజుకుంటుందని ధీమా
  • కర్ణాటక, మహారాష్ట్రలలో బీజేపీ బలంగా లేదని వ్యాఖ్య

తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఉనికిలో లేని బీజేపీ 400కు పైగా స్థానాలు సాధిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. తమ పార్టీ 400కు పైగా స్థానాల్లో గెలుస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ... కొన్ని రాష్ట్రాలలో ఉనికిలోనే లేని పార్టీ అన్ని స్థానాలు ఎలా గెలుచుకుంటుందో చెప్పాలన్నారు.

గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఇప్పుడు చాలా సీట్లను కోల్పోనుందని జోస్యం చెప్పారు. ఇండియా కూటమి పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో బీజేపీ బలంగా లేదన్నారు. మహారాష్ట్రలోనూ బలహీనంగా ఉందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో మాత్రమే ఫైట్ ఇస్తోందన్నారు. ఇలాంటప్పుడు వారు చెప్పినన్ని సీట్లు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News