K Kavitha: మద్యం పాలసీ కేసులో కేసీఆర్ పేరును ఈడీ ఎక్కడా ప్రస్తావించలేదు: కవిత లాయర్

Kavithas lawyer responded on KCR name ED counter
  • ఈడీ కేసీఆర్ పేరును ఎక్కడా పేర్కొనలేదని వెల్లడి
  • మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ఈడీ ప్రస్తావించినట్లు వెల్లడి
  • రాఘవ తన వాంగ్మూలంలో తండ్రి శ్రీనివాసులు పేరును ప్రస్తావించారని వ్యాఖ్య
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈడీ ఎక్కడా కేసీఆర్ పేరును ప్రస్తావించలేదని కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు తెలిపారు. ఈడీ వాదనలలో కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ... ఈడీ ఎక్కడా కేసీఆర్ పేరును రాయలేదన్నారు.

వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ప్రస్తావించిందని తెలిపారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రస్తావన మాత్రమే ఈడీ చేసిందన్నారు. మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులు రెడ్డికి మద్యం కేసులో ఉన్న వారిని పరిచయం చేశారని ఈడీ పేర్కొందన్నారు.
K Kavitha
Delhi Liquor Scam
BRS

More Telugu News