PM Modi: కంగన రనౌత్ కు వేదికపై ఝలక్ ఇచ్చిన ప్రధాని మోదీ!

PM Modi Softly Rejected Kangana Ranaut Rose Flower Presentation in Mandi
  • హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బరిలోకి కంగ‌న 
  • ఈ క్ర‌మంలో ఆమె త‌ర‌ఫున‌ మండిలో ఎన్నిక‌ల‌ ప్ర‌చారంలో పాల్గొన్న మోదీ
  • స్టేజ్‌పై ప్ర‌ధానికి గులాబీ ఇచ్చేందుకు ప్రయత్నించిన కంగ‌న‌
  • సున్నితంగా తిరస్కరిస్తూ చేతులెత్తి దండం పెట్టిన మోదీ
బాలీవుడ్‌లో తనకంటూ ప్ర‌త్యేక‌మైన‌ ఇమేజ్ సొంతం చేసుకొన్న కంగన రనౌత్ ప్రస్తుతం రాజకీయ అరంగేట్రం చేశారు. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్ల‌మెంట్ స్థానం నుంచి బరిలోకి నిలిచారు. దీంతో ప్ర‌స్తుతం ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్ర‌మంలో కంగనకు ప్రధాని న‌రేంద్ర‌ మోదీ చిన్న ఝలక్ ఇచ్చారు. 

బీజేపీ ప్రచారంలో భాగంగా మండి నియోజకవర్గంలో తాజాగా ప్రధాని మోదీ పర్యటించారు. మండిలో ఏర్పాటు చేసిన సభలో కంగన రనౌత్ తరఫున ప్రసంగించారు. అంతకుముందు ప్రధానిని ఆహ్వానిస్తూ.. ఒక గులాబీ పువ్వును ఇచ్చేందుకు ఆమె ప్రయత్నించారు. తన అనుచరులు తీసుకొచ్చిన గులాబీని కంగన అందించడానికి ప్రయత్నించ‌గా.. సున్నితంగా తిర్కరిస్తూ మోదీ చేతులెత్తి దండం పెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. 
PM Modi
Kangana Ranaut
Rose Flower
BJP
Mandi
Himachal Pradesh
Lok Sabha Polls

More Telugu News