Indian Railways: సికింద్రాబాద్-రేపల్లె రైలులో శబ్దాలు... ఎగసిపడిన నిప్పురవ్వలు.. నిలిచిపోయిన రైలు!

Secunderabad Repalle Express stops due to technical issues
  • భయాందోళనలకు గురై చైన్ లాగిన ప్రయాణికులు
  • గుంటూరు బైపాస్ దాటిన తర్వాత దాదాపు మూడు గంటలు నిలిచిన రైలు
  • దాదాపు తొమ్మిది గంటలకు తిరిగి బయలుదేరిన రైలు
సికింద్రాబాద్ - రేపల్లె రైలులో ఒక్కసారిగా నిప్పు రవ్వలు ఎగసిపడటంతో గుంటూరు బైపాస్ దాటిన తర్వాత నిలిచిపోయింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి రేపల్లెకు బయలుదేరింది. రైలు నుంచి ఒక్కసారిగా శబ్దాలు రావడంతో పాటు నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై చైన్ లాగారు. దీంతో రైలు దాదాపు మూడు గంటలపాటు నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే రైలు రాత్రి 10 గంటలకు రేపల్లె నుంచి సికింద్రాబాద్ బయలుదేరాల్సి ఉంది. ఈ రైలు మరికొన్ని నిమిషాల్లో రేపల్లెకు చేరుకోనుంది.
Indian Railways
Train

More Telugu News