KTR: ఉద్దేశ‌పూర్వ‌కంగానే రాజ‌ముద్ర మార్పు: కేటీఆర్‌

BRS Working President KTR at Charminar

  • చార్మినార్‌కు కేటీఆర్‌, బీఆర్ఎస్ నేత‌లు
  • అధికారిక ముద్ర మార్పును నిర‌సిస్తూ చార్మినార్ వ‌ద్ద ధ‌ర్నా
  • రాజ‌ముద్ర నుంచి చార్మినార్‌ను తొల‌గించే కుట్ర జ‌రుగుతోందని ఆరోపణ‌
  • హైద‌రాబాద్ ఐకాన్‌గా చార్మినార్ ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు పొందింద‌న్న కేటీఆర్‌
  • కేసీఆర్ పెట్టిన గుర్తులు మార్చాల‌ని చూస్తున్నారంటూ రేవంత్‌పై మండిపాటు

రాజ‌కీయ కుట్ర‌తోనే కాంగ్రెస్ స‌ర్కార్ ఉద్దేశ‌పూర్వ‌కంగా రాజ‌ముద్ర‌ను మార్పు చేయాల‌ని నిర్ణ‌యించింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అధికారిక ముద్ర మార్పును నిర‌సిస్తూ బీఆర్ఎస్ నేత‌ల‌తో క‌లిసి చార్మినార్ వ‌ద్ద ఆయన ధ‌ర్నాకు దిగారు. రాజ‌ముద్ర నుంచి చార్మినార్‌ను తొల‌గించ‌డానికి కుట్ర జ‌రుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ అన‌గానే మొద‌ట గుర్తొచ్చేది హైద‌రాబాద్‌, చార్మినార్ అని కేటీఆర్ పేర్కొన్నారు. హైద‌రాబాద్ ఐకాన్‌గా చార్మినార్ ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు పొందింద‌న్నారు. 

నాడు ఎన్టీఆర్ కాక‌తీయ క‌ళాతోర‌ణం ప్రతిమను ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా పెట్టార‌ని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన‌లేద‌ని, కేసీఆర్ పెట్టిన గుర్తులు మార్చాల‌ని చూస్తున్నారంటూ మండిప‌డ్డారు. గ‌త ప‌దేళ్ల‌లో చేసిన ప్ర‌గ‌తిని క‌నిపించ‌కుండా చేసేందుకు రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం కక్షగట్టిందని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వాగ్దానాల‌ను నిల‌బెట్టుకోకుండా ఇలాంటి ప‌నికిమాలిన చ‌ర్య‌ల‌కు దిగ‌డం స‌రికాద‌ని అన్నారు. అసలు సీఎం రేవంత్‌కు ఇలా రాజ‌ముద్ర‌ను మార్చాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

  • Loading...

More Telugu News