Narendra Modi: కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మోదీ... ఎల్లుండి సాయంత్రం వరకు అక్కడే ధ్యానం

PM Modi arrives Kanyakumari to meditate till June 1 evening
  • జూన్ 1న దేశంలో ఏడో విడత పోలింగ్
  • నేటితో ముగిసిన ప్రచారం
  • కన్యాకుమారి పర్యటనకు వెళ్లిన ప్రధాని
  • ఇక్కడి రాక్ మెమోరియల్ వద్ద రేయింబవళ్లు ధ్యానం చేయనున్న మోదీ
దేశంలో సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఈ నేపథ్యంలో, నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తాను పోటీ చేస్తున్న వారణాసి లోక్ సభ స్థానంలో ప్రచారం ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారి చేరుకున్నారు. 

ఇక్కడి ప్రఖ్యాత రాక్ మెమోరియల్ చిహ్నాన్ని సందర్శించిన మోదీ నేటి సాయంత్రం నుంచి ఎల్లుండి (జూన్ 1) సాయంత్రం వరకు ఇక్కడే రేయింబవళ్లు ధ్యానం చేయనున్నారు. నాడు స్వామి వివేకానందుడు కూడా ఇక్కడి ధ్యాన మండపంలోనే ధ్యానం చేశారు. కన్యాకుమారి విచ్చేసిన సందర్భంగా ఇక్కడి భగవతి అమ్మాన్ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఆశీస్సులు అందుకున్నారు.
Narendra Modi
Kanyakumari
Meditation
Varanasi
Lok Sabha Polls

More Telugu News