Russia: ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో రష్యా వ్లాగర్ పూజలు.. వీడియో వైరల్

Russian Vlogger Visit to Siddhi Vinayak Temple Has Internet Talking

  • ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ మారియా చెగురోవా
  • ఆలయంలో భక్తుల రద్దీ, తోపులాట ఉన్నప్పటికీ మనసుకు ప్రశాంతత ఉందని వ్యాఖ్య
  • గుడి బయట తన ఫాలోవర్లతో ఫొటోలకు పోజులు.. వీడియోకు 30 లక్షల వ్యూస్

రష్యాకు చెందిన ప్రముఖ ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ మారియా చెగురోవా తాజాగా భారత్ లో పర్యటించింది. ముంబైలోని ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించిన వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు హిందూ సంస్కృతిపట్ల ఆమెకున్న భక్తిశ్రద్ధలను చూసి ముచ్చటపడుతున్నారు. ఈ వీడియోకు ఏకంగా 30 లక్షల వ్యూస్ లభించాయి. అలాగే 3.5 లక్షల లైక్ లు వచ్చాయి.

ఆ వీడియోలో చూడీదార్ ధరించి, నుదుటన బొట్టు పెట్టుకొని మారియా చెగురోవా కనిపించింది. వినాయకుడికి పూజ చేసేందుకు ఆలయ ఆవరణలో పూజా సామగ్రి, పూల దండ కొనుగోలు చేసింది. అనంతరం దైవదర్శనం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయంలో భక్తుల రద్దీ, తోపులాట ఉన్నప్పటికీ విఘ్నేశ్వరుని దర్శనంతో మనసుకు ప్రశాంతత లభించిందని వ్యాఖ్యానించింది. ఈ అనుభవానికి ఎంతో గర్విస్తున్నట్లు పేర్కొంది. ఆలయం నుంచి బయటకు వచ్చిన ఆమెను అక్కడ చూసిన ఇన్ స్టా  ఫాలోవర్లు ఆమెను గుర్తించి అవాక్కయ్యారు. దీంతో వారితో కలిసి ఆమె సరదాగా ఫొటోలు దిగింది. ఓ మహిళ అయితే ఏకంగా ఆమెకు ముద్దు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన మారియా చెగురోవా దాని కింద సుదీర్ఘ క్యాప్షన్ ను జత చేసింది. నమస్తే దోస్తులారా అంటూ అందులో రాసుకొచ్చింది.

ఈ వీడియోను చూసి చాలా మంది నెటిజన్లు స్పందించారు. ‘భారత సంస్కృతిని ఆమె ఎంతో ఆస్వాదిస్తోంది’ అని ఓ యూజర్ పేర్కొన్నాడు. మరో యూజర్ స్పందిస్తూ ‘భారత్ నుంచి అమితమైన ప్రేమ’ అంటూ మరొకరు స్పందించారు. క్యూట్ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

View this post on Instagram

A post shared by Mariia Chugurova (@mariechug)

  • Loading...

More Telugu News