Monsoon: జూన్ 5 లోపు ఏపీలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం: ఐఎండీ
- రెండ్రోజుల ముందే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
- రుతుపవనాల ఆగమనానికి ముందు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్న ఐఎండీ
- ఏపీలో మరో రెండ్రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు తప్పవని వెల్లడి
రెండ్రోజుల ముందే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
ఏపీలో ప్రస్తుతం అత్యధిక వేడిమి నెలకొందని, రుతుపవనాల ఆగమనానికి ముందు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల సహజమేనని ఐఎండీ వివరించింది. మరో రెండు మూడు రోజుల పాటు ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది.
జూన్ 5 లోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించాయని ఐఎండీ తాజా బులెటిన్ లో తెలిపింది.