Daggubati Purandeswari: రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు వినతి పత్రం అందజేసిన పురందేశ్వరి
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు
- సీఎస్ ద్వారా ఏపీ అప్పులు, ఇతర వివరాలు బహిర్గతం చేయించాలని విజ్ఞప్తి
- గవర్నర్ ను కలిసిన వారిలో యామినీ శర్మ, కాపు రామచంద్రారెడ్డి తదితరులు
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నేడు విజయవాడలో రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు ప్రకటించాలని కోరుతూ గవర్నర్ కు వినతి పత్రం అందించారు.
ఆర్బీఐ జాబితాలో పేర్కొన్న ప్రకారం ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పులు, ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు, కార్పొరేషన్ల ద్వారా తీసుకువచ్చిన అప్పులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు, చెల్లించిన బిల్లులు... ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన అప్పుల వివరాలు, ప్రభుత్వ ఉద్యోగులకు టీఏ, డీఏ బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న కేసులు... తదితర వివరాలు అందించేలా రాష్ట్ర సీఎస్ కు నిర్దేశించాలని పురందేశ్వరి గవర్నర్ ను కోరారు.
పురందేశ్వరితో పాటు ఇతర బీజేపీ నేతలు సాధినేని యామినీ చౌదరి, కాపు రామచంద్రారెడ్డి, పాతూరి నాగభూషణం, బిట్ర శివన్నారాయణ కూడా గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు.