Bird Flu: బర్డ్‌ఫ్లూపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

Centre directs to keep vigil on avian influenza

  • రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం అలర్ట్
  • పౌల్ట్రీలు, ఇతర పక్షుల అసాధారణ మరణలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
  • ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా మానవులకూ సోకే ఆస్కారం ఉందని హెచ్చరిక  

ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా లేదా బర్డ్ ఫ్లూ (H5N1)పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు నాలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలను గుర్తించింది. ఏపీలోని నెల్లూరు, మహారాష్ట్రలోని నాగపూర్, కేరళలోని అలప్పుజ, కొట్టాయం, ఝార్ఖండ్‌లోని రాంచీలలో దాని వ్యాప్తిని గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో పౌల్ట్రీలు, ఇతర పక్షులకు సంబంధించి అసాధారణ మరణాలు సంభవించడంపై అప్రమత్తంగా ఉండాలని, ఆ విషయాన్ని వెంటనే పశుసంవర్ధక శాఖకు తెలియజేయాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.

అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా మానవులకూ సోకే ఆస్కారం ఉందని హెచ్చరించింది. ఈ వ్యాధి సంక్రమణను నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొంటూ మే 25న ఎన్సీడీసీ, కేంద్ర పశుసంవర్ధక శాఖలు కలిసి సంయుక్తంగా జారీ చేసిన ప్రకటనలో వెల్లడించాయి. యాంటీవైరల్ ఔషధాలు, పీపీఈ కిట్లు, మాస్కులు అందుబాటులో ఉండాలని పేర్కొంది. ఇన్‌ఫెక్షన్ సోకిన పక్షులను వధించే వారితోపాటు పర్యవేక్షకుల నుంచి క్రమంగా నమూనాలు తీసుకొని H5N1 పరీక్షలు నిర్వహించాలని తెలిపింది.

  • Loading...

More Telugu News