Komatireddy Venkat Reddy: ఇవాళ రాత్రికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి... 12 సీట్ల వరకు గెలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy says Conress will win 12 seats in telangana
  • కాంగ్రెస్ 9 నుంచి 12 లోక్ సభ స్థానాలు గెలుస్తుందని జోస్యం
  • 4వ తేదీ తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీయే ఉండదని వ్యాఖ్య
  • సోనియాపై అనుచిత విమర్శలు చేసిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారన్న మంత్రి
ఇవాళ రాత్రికి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయని... కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఈ నెల 4వ తేదీన ఫలితాలు వచ్చాక బీఆర్ఎస్ అనే పార్టీయే ఉండదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. తమ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీపై అనుచిత విమర్శలు చేసిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.
Komatireddy Venkat Reddy
Congress
KCR
Lok Sabha Polls

More Telugu News