Revanth Reddy: ఎగ్జిట్ పోల్ ఫలితాల నేపథ్యంలో... సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

CM Revanth Reddy interesting comments on Lok Sabha polls
  • దేశంలో ఇండియా కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని జోస్యం
  • తెలంగాణలో తాము 12 లోక్ సభ స్థానాలు గెలుస్తామని ధీమా
  • తెలంగాణకు 4 కేంద్రమంత్రి పదవులు అడుగుతామన్న సీఎం
ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో తాము 12 లోక్ సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో అధికారంలోకి వచ్చాక తెలంగాణకు 4 కేంద్రమంత్రి పదవులు అడుగుతామని తెలిపారు.

ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రానుంది. దాదాపు అన్ని సర్వేలు కూడా ఎన్డీయే కూటమే అధికారంలోకి రానుందని వెల్లడించాయి. బీజేపీ 350 సీట్ల వరకు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నాయి. ఇక తెలంగాణలో బీజేపీకి 7 నుంచి 12, కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 10 సీట్లు వస్తాయని అంచనా వేశాయి.
Revanth Reddy
BJP
Congress
Lok Sabha Polls

More Telugu News