T20 World Cup 2024: వార్మప్ మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్‌పై భారత్ రికార్డు విజయం

Rishabh Pant  and Arshdeep Singh shine and India India record big win over Bangladesh in warmup Match In T20 World Cup 2024

  • 60 పరుగుల తేడాతో గెలుపు
  • బ్యాటింగ్‌లో పంత్.. బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్ సత్తా
  • జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా

టీ20 వరల్డ్ కప్2024లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య శనివారం జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా రికార్డు స్థాయి విజయం సాధించింది. 60 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రిషబ్ పంత్ 32 బంతుల్లో 53 పరుగులు, హార్దిక్ పాండ్యా అజేయ 40 పరుగులతో రాణించారు. అయితే లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 60 పరుగుల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 కీలకమైన వికెట్లు తీశారు. ఇక ఆల్ రౌండర్ శివమ్ దూబే కూడా బౌలింగ్‌లో మెరిశాడు. 2 కీలకమైన వికెట్లు తీయడమే కాకుండా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇతర బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడడానికి ముందు సాధించిన ఈ విజయం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపనుంది.

భారత బ్యాటర్లలో రిషబ్ పంత్‌తో పాటు హార్దిక్ పాండ్యా కూడా రాణించాడు. 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక అంతా భావించినట్టుగానే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టులోకి సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌, శివమ్ దూబేలను తీసుకున్నాడు. అయితే శాంసన్ కేవలం ఒక పరుగు చేసి పెవీలియన్ చేరాడు.

  • Loading...

More Telugu News