Sanjay Raut: విజయం ఇండియా కూటమిదే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెనక అసలు కథ ఇదీ: సంజయ్ రౌత్

Sanjay Rauts corporate game charge after exit polls
  • ఎగ్జిట్ పోల్స్‌ను ‘కార్పొరేట్ ఆట’గా అభివర్ణించిన సంజయ్ రౌత్
  • ఎగ్జిట్ పోల్స్ సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆరోపణ
  • ఇండియా కూటమి 295-310 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా
  • సుప్రియా సూలే 1.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉండడంతోనే ఫలితాలన్నీ ఒకే రకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను ‘కార్పొరేట్ల ఆట’గా అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 295 నుంచి 310 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు. 

బారామతిలో ఎన్సీపీ (శరద్ పవార్) నేత సుప్రియా సూలే 1.5 లక్షల మెజార్టీతో గెలవబోతున్నట్టు చెప్పారు. గతంలో సాధించిన 18 సీట్లను తమ పార్టీ (శివసేన) నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఈసారి అద్భుత ప్రదర్శన కనబరుస్తుందన్న సంజయ్ రౌత్.. యూపీలో ఇండియా కూటమి 35, బీహార్‌లో ఆర్జేడీ 16 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.
Sanjay Raut
Shiv Sena
INDIA Bloc
Exit Polls

More Telugu News