Income Tax: ఈ దేశాల్లో సంపాదించిన దాంట్లో సగానికి పైగా ఇన్కమ్ ట్యాక్స్ కింద చెల్లించుకోవాల్సిందే!
- ఆదాయపన్ను జోలికి పోని కొన్ని దేశాలు
- 50 శాతానికిపైగా వసూలు చేస్తున్న మరికొన్ని దేశాలు
- మన దగ్గర గరిష్ఠంగా 42.74 శాతం ఇన్కమ్ ట్యాక్స్
కొన్ని దేశాలు మినహా ప్రపంచంలోని చాలా దేశాలు ఇన్కమ్ ట్యాక్స్‌ను వసూలు చేస్తాయి. సంపాదించే ఆదాయాన్ని బట్టి ప్రజలు దానిని చెల్లించాల్సి ఉంటుంది. పన్నుల రూపంలో వసూలు చేసే సొమ్మును ప్రభుత్వాలన్నీ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి ఖర్చు చేస్తుంటాయి.
అయితే, ఈ పన్నులు అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉండవు. కొన్ని దేశాలు ఆదాయపన్ను జోలికి వెళ్లకపోగా, మరికొన్ని దేశాల్లో సంపాదించిన దాంట్లో సగానికిపైనే చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని దేశాలు దాదాపు సగం వసూలు చేస్తాయి.
ఇక మన దేశంలో అయితే, రూ. 5 లక్షల వరకు ఆదాయపన్ను కట్టక్కర్లేదు. ఆ తర్వాతి నుంచి మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. సంపాదనను బట్టి గరిష్ఠంగా మన దేశంలో 42.74శాతం వసూలు చేస్తారు. అయితే, 60 శాతం ఆదాయపన్నును వసూలు చేసే దేశాలు కూడా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? ఆ దేశాలేంటో? ఆదాయపన్నును ఏ మేరకు వసూలు చేస్తారో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.