Hardik Pandya: కలిసిపోయిన హార్దిక్ పాండ్యా-నటాషా.. కావాలంటే ఇది చూడండి!
- పాండ్యా-నటాషా విడిపోతున్నట్టు వార్తలు
- నటి దిశా పటానీ బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించిన నటాషా
- భార్యకు 70 శాతం ఆస్తిని పాండ్యా ట్రాన్స్ఫర్ చేశాడంటూ పుకార్లు
- వెడ్డింగ్ ఫొటోలను రీస్టోర్ చేసి పుకార్లకు తెరదించిన నటాషా
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిక్ దంపతులు విడిపోయారంటూ గత కొన్ని రోజులుగా ఒకటే రూమర్లు. ఈ పుకార్లకు కారణం కూడా ఉంది. తన ఇన్‌స్టా ఖాతా నుంచి తమ వెడ్డింగ్ ఫొటోలను, తన పేరు నుంచి పాండ్యా అన్న సర్నేమ్ను నటాషా తొలగించడమే అందుకు కారణం.
ఆ తర్వాత నటాషా.. బాలీవుడ్ ప్రముఖ నటి దిశా పటానీ బాయ్‌ఫ్రెండ్‌తో బహిరంగంగా కనిపించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఐపీఎల్లో పాండ్యా ముంబైకి సారథ్యం వహించినప్పటికీ ఒక్కసారి కూడా స్టాండ్స్‌లో కనిపించకపోవడం.. ఇలా వరుస ఘటనలు ఈ రూమర్లు నిజమనుకునేలా చేశాయి.
దీనికితోడు ఈ వార్తలపై అటు పాండ్యా కానీ, ఇటు నటాషా కానీ బహిరంగంగా స్పందించకపోవడంతో అభిమానులు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇదొక్కటే కాదు.. హార్దిక్ తన నికర ఆస్తిలో దాదాపు 70 శాతం వాటాను భార్యకు బదిలీ చేశాడన్న వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.
తాజాగా, నటాషా ఈ రూమర్లు అన్నింటికీ చెక్ పెడుతూ.. తమ పెళ్లి ఫొటోలను తిరిగి ఇన్‌స్టాలో రీస్టోర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు ఐదు రోజుల క్రితం బాంద్రా-వోర్లి సీ లింక్‌పై నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ సిరీస్‌లో పోస్టు చేసిన ఈ సెర్బియన్ మోడల్.. ‘దేవుడిని ప్రశంసించండి’ అని రాస్తూ ఎమోజీలు జోడించింది. అంతకుముందు మరో పోస్టులో.. ‘ఎవరో వీధుల్లోకి రాబోతున్నారు’ అని గుంభనంగా రాసుకొచ్చింది. తాజాగా, ఇప్పుడు తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో రీస్టోర్ చేసిన నటాషా రూమర్లకు తెరదించింది.